ఫన్నీగా ఫసక్‌ చేస్తున్న బన్నీ

‘ఓన్లీ వన్స్‌ ఫసక్‌’.. మోహన్‌ బాబు చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌ టాక్‌ వంటి యాప్స్‌లో హల్‌చల్‌ చేసింది. దీనికి డీజేలు కూడా తోడై విపరీతంగా అలరించింది. మరి ఈ డైలాగ్‌ అల్లు వారు చెబితే ఎలా ఉంటుంది. చెప్పడమెందుకు ఆ వీడియోను మీరూ చూసేయండి. సమయం దొరికినప్పుడల్లా అర్జున్‌ తన పిల్లలతోనే గడుపుతుంటాడు. వారితో గడిపిన మధుర క్షణాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా గారాల తనయ అర్హా చెప్పిన ఫేమస్‌ డైలాగ్‌ను తానూ చెప్తూ మురిసిపోయిన బన్నీ వీడియోను షేర్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు ‘తండ్రికి తగిన తనయ, సూపర్‌, చాలా బాగా చెప్పావ్‌ అర్హా’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. గతంలోనూ అర్హా చెప్పిన ఎన్నో డైలాగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. 

View this post on Instagram

Cutest father and daughter duo!! #alkuarjun #arha #celebritycoupleinsta

A post shared by Celebrity Couple (@celebritycouple.insta) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.