చిరు నవ్వుల పాప పూజాహెగ్డే

పూజాహెగ్డే ఇప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్రకథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతూ ప్రేక్షక్షులను అలరిస్తుంది. ఈరోజు పూజాహెగ్డే పుట్టినరోజు. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ‘ప్రేరణ’ అనే పాత్రను పరిచయం చేస్తూ నవ్వుతున్న ఓ అందమైన ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. ఫోటోలో పూజా చాలా అందంగా ఉంది. 1960ల నాటి యూరప్‌లోని రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అందులో చక్కతో చేసిన సీట్లో కూర్చొని ఉంది. ఆమెకు ఎదురుగా ప్రభాస్‌ పోలిన ఆకారం కూడా కనిపోస్తోంది. ఇంకా చిత్రంలో భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, సచిన్‌ కేడ్కర్‌ నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.  హెగ్డే పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.