బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఉంటూ హల్చల్ చేస్తుంది. ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలుపుతోంది. కొన్ని సార్లు ఆమెకు బెదిరింపులు సైతం వచ్చాయి. తాజాగా ఈ అమ్మడు తన ఫిట్నెస్ ట్రైనర్ అయినా నుపూర్ షిఖరేతో ప్రేమలో ఉందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ కలిసున్న ఫోటోలు అంతర్జాలంలో వైరలౌతున్నాయి. ఇప్పటికే తమ ప్రేమ వ్యవహారాన్ని ఐరా తన తల్లికి చెప్పిందట. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపిందట. ఈ సందర్భంగా ప్రేమజంట ఆమిర్కి చెందిన ఓ వ్యవసాయ క్షేత్రంలో కలిసి పార్టీ కూడా చేసుకుందట. పార్టీ చేసుకున్న ఫోటోలు సైతం హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఇరా ఖాన్ మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపాలానితో డేటింగ్ చేసింది. అప్పుడు చెట్టాపట్టాలేసుకోని తిరుగుతోన్న రొమాంటిక్ ఫోటోలను సైతం ఇన్స్టాలో పంచుకుంది.