సిక్స్‌ప్యాక్‌తో ఇస్మార్ట్‌గా..

పూరి జగన్నాథ్‌ చిత్రాల్లో డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా వినిపిస్తాయో.. కథానాయకుడి తీరు తెన్నులు కూడా అంతే హైలెట్‌గా దర్శనమిస్తాయి. ఆయన చిత్రాల్లోని నాయకులందరినీ అల్లరి చిల్లరిగా చూపిస్తూనే ఓ పవర్‌ఫుల్‌ హీరోయిజాన్ని పండించాడు పూరి. ఇప్పుడిదే ఫార్ములాను రామ్‌తో చేయబోతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తోనూ కొనసాగించబోతున్నాడు. పూరి దర్శకత్వం వహిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. నిధి అగర్వాల్, నభా నటేష్‌ కథానాయికలు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఇందులో రామ్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌తో దర్శనమివ్వబోతున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టేసినట్లు తెలియజేస్తూ.. సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నాడు రామ్‌. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ‘‘2.0 లోడింగ్‌’’ అని ఈ ఫొటోలకు ఓ కామెంట్‌ను కూడా జత చేశాడు రామ్‌. ఇందులో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. నటి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.