‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సందేశం ఇవ్వడు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సందేశం ఇచ్చే సినిమా కాదు. కేవలం ఎంటర్‌టైన్ చేసేది మాత్రమే అంటున్నాడు యంగ్‌ హీరో రామ్‌. పూరి దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జులై 18న విడుదలవుతున్న సందర్భంగా అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలు సీట్లోంచి లేచి డ్యాన్స్‌ చేయిస్తాయి. ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లో మిస్సైన ఎనర్జీని మళ్లీ చూస్తారు. ప్రేమతో మీ తెలుగు సినిమా ఫ్యాన్‌’ అని ట్వీటర్‌ వేదికగా తెలిపాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.