బెల్లీ డ్యాన్స్‌తో ఊపేస్తున్న జాన్వీ

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌లో మంచి డ్యాన్సర్‌ ఉన్న సంగతి తెలిసిందే. స్వతహాగా నృత్యాన్ని ఇష్టపడే ఆమె అప్పుడప్పుడు చిన్న చిన్న స్టెప్పులేసి వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా బెల్లీ డ్యాన్స్‌ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 2001లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘అశోక’లోని సన్‌ సనన అనే గమ్మత్తైన గీతానికి హొయలొలికిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. తెల్లని దుస్తులో దర్శనమిచ్చి కెవ్వు కేక పెట్టిస్తుంది. అద్భుతమైన నృత్య ప్రదర్శన వీక్షించిన బాలీవుడ్‌ ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో ‘దోస్తానా 2’, ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ ప్రాజెక్టులు ఉన్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.