జయా బచ్చన్‌ డ్రగ్స్ పై రాజకీయం చేస్తున్నారు: జయప్రద

ఈ వారం పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యసభలో ఎంపీ జయా బచ్చన్‌ బాలీవుడ్‌లో మాట్లాడుతూ..చిత్రసీమపై కొందరు అనవసరంగా అభాండాలు వేస్తున్నారు. అంతేకాదు అన్నం పెట్టిన చెయ్యినే నరికేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. జయా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ జయప్రద భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జయప్రద జాతీయ మీడియాతో మాట్లాడుతూ..మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యతపై రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలకు నేను సంపూర్ణ మద్దతును తెలుపుతున్నా. మాదకద్రవ్యాల (డ్రగ్స్ ) వ్యతిరేకంగా అందరూ గొంతు విప్పాలి. మన యువతను కాపాడుకోవాలి. కానీ జయా బచ్చన్‌ ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారు. ఎవరో కొద్ది ఉన్నంత మాత్రాన మొత్తం చిత్రసీమనే ఇమేజ్‌ని ఎవరు దెబ్బతీయలేరని చెప్పింది. చిత్రసీమలో జయా బచ్చన్‌కి మద్దతుగా హేమామాలిని, తాప్సీ, దియా మీర్జా, సోనమ్‌ కపూర్‌ వంటి వాళ్లు తమ సంఘీభావాన్ని తెలిపారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.