అలనాటి కథానాయిక జయచిత్ర భర్త గణేష్ ఇకలేరు. ఆయన గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు అరవైరెండేళ్లు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు బంధుమిత్రులు నివాళులర్పించారు. ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. తెలుగు సంతతికి చెందిన జయచిత్ర సుమారు 200పైగా చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. 1970 నుంచి 1980ల మధ్య చాలా బిజీగా కథానాయికగా ఎన్నో సినిమాల్లో అలరించింది. తమిళనాడులోని కుంభకోణానికి చెందిన గణేష్‌తో 1983లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కుమారుడు ఉన్నారు. పేరు అమ్రిష్. కలిగాడు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తమిళ చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్నారు. శోభన్‌బాబుతో సోగ్గాడు చిత్రంలో లత పాత్రలో అలరించింది. మా దైవం, ఆత్మీయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, అన్నదమ్ముల సవాల్, యవ్వనం కాటేసింది, కటకటాల రుద్రయ్య, , ముద్దబంతి పువ్వుల్లో నాయికగా చేసింది. ఇక ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అబ్బాయిగారు చిత్రంలో వెంకటేష్ అమ్మ పాత్రలో నటించి అలరించింది. సమరసింహారెడ్డి, ఘరానా బుల్లోడులాంటి చిత్రాల్లోనూ అలరించింది.