ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ టోరంటో ఫిల్మ్‌ వేడుకలకు ‘జెర్సీ’


నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా, సత్యరాజ్, రోనిత్‌ కమ్రాలు కలిసి నటించిన ఈ సినిమా 2019లో మంచి విజయాన్నే నమోదు చేసుకొంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా జరిగే అంతర్జాతీయ ఇండియన్‌ టోరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2020 ప్రదర్శనకి తెలుగు నుంచి ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15వరకు కెనడాలో ఈ వేడుక జరుగుతోంది. ఆగస్టు 11న సాయంత్రం 7 గంటలకు సినిమా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్పందిస్తూ..‘‘నిజంగా మా చిత్రం ఇలాంటి వేడకకు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. కెనడాలో భారత స్వాతంత్య్ర దినోవత్సవాన్ని జరుపుకోవడం మాకెంతో గర్వంగాను, సంతోషంగా ఉందని’’ తెలిపారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం హిందీలోనూ రీమేక్‌ చిత్రంగా రూపొందుతోంది. బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా, మృణాల్‌ ఠాగూర్‌ నాయికగా నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.