జస్టీస్‌ ఫర్‌ జయరాజ్‌ అంటోన్న సినీతారలు

ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా మానవతా దృష్టితో ప్రతి ఒక్కరు తమ మద్దతును తెలియజేస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. గత నెల్లో అమెరికాలో అమెరికన్‌ ఆఫ్రికన్‌ జాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్‌ ఓ తెల్లపోలీస్‌ అధికారి కూర్రంగా హింసించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ప్రపంచమంతా అతనికి మద్దతు తెలిపింది. తాజాగా తమిళనాడులోని సాతంకుళంలో అనే ఊరిలో మొబైల్‌ దుకాణం నడుపుకుంటున్నారు జయరాజ్‌ అతని కుమారుడు ఫెనిక్స్. లాక్‌డౌన్ సయమంలో నిర్ణీత సమయం కంటే ముందుగా షాపు తెరిచారని పోలీసులు కస్టడిలోకి తీసుకొని ఒకరోజుంతా స్టేషన్‌లో ఉంచి కొట్టడంతో వాళ్లు రెండురోజుల తరువాత మరణించారు. దీంతో వీళ్ల మరణంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వీరి మరణానికి కారణం పోలీసులే కారణమంటూ ఆందోళన జరుగుతోంది. ఇప్పుడు దేశమొత్తం జస్టీస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్ అనే నినాదాలతో సామాజిక మాధ్యమాల్లోనూ మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆందోళనకు మద్దదతుగా సినీ తారలు కాజల్‌ అగర్వాల్, తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, జెనీలియా తమవంతు మద్దదతుగా సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.
ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ..‘‘ఇది భరించలేనిది. సమాజంలో మనం ఎలా ఉన్నామో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వారితరపున న్యాయం కోసం పోరాడాలి. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్లో పేర్కొంది.

రకుల్‌ప్రీత్‌సింగ్‌ ట్విట్‌ చేస్తూ..‘‘ఇది హృదయ విదారకరం. నేను ఇలాంటి సంఘటనలను అసహ్యించుకుంటున్నాను. ఇలాంటి కూర్రమైన, అమానవీయమైన చర్య. ఈ విధంగా మరొకరి జీవితాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. మరణించివారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ ఆ తండ్రికొడుకులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా.
తాప్సీ పన్నూ.. ఈ కేసుగురించి స్పందిస్తూ.."ఇది చాలా కేసులలో ఒకటి కావచ్చు, కానీ స్నోబాల్ ప్రభావాన్ని ఎంత ప్రభావం చూపెడుతుందో చెప్పలేం. అందుకే జయరాజ్, ఫెనిక్స్ లకు న్యాయం జరగాలి.  ఈ కేసు వివరాలు వింటుంటే చాలా భయానకంగా ఉన్నాయని అంటోంది.
జెనెలియా దేశ్‌ముఖ్ స్సందిస్తూ.."విషయం తెలిసి నేను చాలా షాక్‌కు గురయ్యాను, మనం ఇంత భయంకరమైన జాతిగా ఎలా మారాము. ఈ సంఘటన చాలా క్రూరంగా ఉంది, ఇది నిజంగా నా హృదయాన్ని కదిలించి వేసింది..’’అంటూ పేర్కొంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.