కాబోయో భర్తకు దసరా శుభాకాంక్షలు చెప్పిన కాజల్‌

ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూతో అక్టోబర్‌ 30న వివాహం జరగనుంది. తాజాగా ఈ అమ్మడు దసరా పండుగను పురస్కరించుకొని కాబోయో భర్తకి...‘‘మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు’’ అంటూ గౌతమ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాజల్‌ నిశ్చితార్థ ఉంగరం ధరించిన ఫోటో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. కాజల్‌ తమిళంలో ‘లైవ్‌ టెలికాస్ట్’ అనే వెబ్‌సీరీస్‌లోనూ నటిస్తుంది. ఈ చిత్రం ఈనెల్లోనే ఓటీటీ మాధ్యమం ద్వారా విడుదల కానుంది. అన్నట్లు ఈ అందాల భామ పెళ్లి చేసుకోగానే ఓ కొత్త ఇంట్లో సంసారం మొదలుపెట్టనున్నారట. తెలుగులో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘లక్ష్మీకల్యాణం’ చిత్రంతో ప్రవేశించి ఎన్నో చిత్రాల్లో అలరించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. అందాల కాజల్‌ ఇక కల్యాణం చేసుకొని శ్రీమతి గౌతమ్ కాజల్‌గా మారుతోంది. 

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.