వైరల్‌.. ‘సెలబ్రేటింగ్‌ లైఫ్‌’ వీడియో

వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తుంది నాయిక కాజల్‌. గౌతమ్‌ కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. చూడముచ్చటైన ఈ జంట ఇటీవలే మాల్దీవుల్లో విహరించారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ మధుర క్షణాల్ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ‘సెలబ్రేటింగ్‌ లైఫ్‌’ అనే ఓ వీడియో విడుదల చేసింది కాజల్‌. ఇందులో ఓ పెద్ద భవనం నడుమ ఉన్న నీటి కొలనులో సంతోషంగా గడుపుతూ కనిపించింది. ఇది కేవలం టీజర్‌ మాత్రమే త్వరలోనే పూర్తి వీడియో రాబోతుందని తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. మరి త్వరలో ఎలాంటి విశేషాలు పంచుకోబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’, తమిళంలో ‘భారతీయుడు 2, పేరు ఖరారు చేయని ఓ హారర్‌ మల్టీస్టార్‌, హిందీలో ‘ముంబయి సగ’ కాజల్‌ చేతిలో ఉన్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.