నాకెలాంటి వైరస్‌ సోకలేదు!
‘దశవతారాల’ నటుడు కమల్‌ హాసన్‌కు కరోనా వైరస్‌ సోకిందంటూ వార్తలొస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన ఉండే నివాసానికి క్యారంటైన్‌ స్టిక్కర్‌ని అతికించడమే. ఈ వార్తపై స్పందించిన కమల్‌ హాసన్‌ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘నేను ఎలాంటి వైరస్‌కు గురికాలేదు. నేను ఉంటున్న ఇంటికి క్యారంటైన్‌ స్టిక్కర్‌ను చెన్నై కార్పోరేషన్‌ వారు అతికించారు. అదే ప్రాంతంలో కొన్ని ఇళ్లకు క్యారంటైన్‌ స్టిక్కర్లు అతికించే సమయంలో పొరపాటున మా ఇంటికి కూడా అతికించారు. తరువాత కార్పోరేషన్‌ వారు తమ తప్పును తెలుసుకొని క్వారంటైన్‌లో లేరు అని ప్రకటన కూడా చేసింది. పూర్తి వివరాలు తెలుసుకొన్నాకే ఏదైనా వార్త రాయాలని కొన్ని న్యూస్‌ ఏజెన్సీలకు సూచన కూడా చేశారు. స్టిక్కర్‌ అతికించిన ఇంటిలోనే నేను చాలా సంవత్సరాలుగా ఉంటున్నా. మా పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం’ కార్యకలాపాలు కూడా అక్కడ నుంచే జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నాన’’ని చెప్పారు. కమల్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో నటిస్తున్నారు. ఆ మధ్య సినిమా చిత్రీకరణ సయమంలో పెద్ద ప్రమాదం కూడా జరిగింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.