మీ బిడ్డలు కూడా నాలా వేధింపులు ఎదుర్కొంటే ఇలానే మాట్లాడతారా: కంగనా

ఇప్పుడు దేశమంతా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో పాటు డ్రగ్స్ వ్యవహారం, మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా రాజ్యసభ్యలో ఎంపీ జయాబచ్చన్‌ డ్రగ్స్ విషయంపై స్పందిస్తూ..‘‘డ్రగ్స్ విషయంలో చిత్రసీమపై కొందరు నిందలు వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, సొంత ఇంటికే ద్రోహం చేస్తున్నారు. అందుకే చిత్రసీమకు ప్రభుత్వ మద్దతు కావాలని కోరింది. ఈ విషయం బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘జయా జీ..నా స్థానంలో మీ బిడ్డలు శ్వేత, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ స్థానంలో అభిషేక్‌ బచ్చన్‌లు ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా? మీ బిడ్డ శ్వేత యుక్తవయసులో నాలాగా చిత్రసీమలో ఎదురుదెబ్బలు తిని, డ్రగ్స్ కు అలవాటు పడి లైగింకగా వేధింపులకు గురైతే ఇదే విధంగా మాట్లాడగలరా? మీ అబ్బాయి అభిషేక్‌ నిరంతర బెదిరింపులకు, వేధింపులకు గురై ఫిర్యాదు చేసి, ఒక రోజు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటే కూడా ఇలానే మాట్లాడతారా? మాపై కూడా మీరు దయ చూపండి..’’ అంటూ పేర్కొంది. మొత్తం మీద కంగనా చేస్తున్న వ్యాఖ్యలు.. బాలీవుడ్‌ చిత్రసీమ, మహరాష్ర్ట ప్రభుత్వ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కంగనా తన గురించి ఓ వీడియోలో మాట్లాడుతూ..‘‘నటనలో ఉత్సాహం ఉండడంతో నేను యుక్తవయసులో ఉన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చాను. ఈ క్రమంలో డ్రగ్స్‌కి (మత్తు) కూడా బానిసను అయ్యాను. అంతేకాదు చాలా మంది చెడ్డవారి మాయల్లో పడి ఎన్నో ఇబ్బందులు పడ్డానని..’’చెప్పింది. ఈ వీడియో సైతం ఇటీవల సామాజిక మాధ్యమాల్తో వైరల్ అవుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.