నా కోసం నేను పోరాడుతున్నాను: కంగానా

ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ మహారాష్ర్ట ప్రభుత్వంపై చాలా సీరియస్‌గా ఉంది. ముంబైలోని తన ఇంటిని బీఎంసీ వాళ్లు కూల్చివేసిన తరువాత ఆమె తన స్వరాన్ని మరింతంగా పెంచింది. తాజాగా ఓ ఆంగ్లమీడియా కంగనాను ప్రశ్నిస్తూ మీరు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు న్యాయం కోసం పోరాడుతున్నారా లేక బాలీవుడ్‌లోని మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) వ్యవహారంపై పోరాడుతున్నారా అని అడగ్గా? అందుక కంగానా జవాబిస్తూ..నేను నా కోసం పోరాడుతున్నాను. నేను చేసే పోరాటం చేస్తే ఎంతో ప్రజలు నా నుంచి ప్రేరణ పొందుతారు. అప్పుడు వ్యవస్థ కూడా అన్ని విధాల బాగుపడుతుంది. వ్యవస్థలోని లోపాలను శుభ్రపరుస్తున్నా. చాలామందికి ఇది మార్గదర్శకంగా ఉంటోంది. అందు కోసమే నా కోసం నేను ప్రయత్నిస్తున్నా..అంటూ చెప్పకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొంతమంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది కంగనాకు వ్యతిరేకంగాను మాట్లాడుతున్నారు. తాజాగా రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడుతూ..కొంతమంది అన్నం పెట్టిన పరిశ్రమనే అభాసుపాలు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అందుకు కంగనా అభ్యతరం తెలుపుతూ.. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘జయా జీ..నా స్థానంలో మీ బిడ్డలు శ్వేత, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ స్థానంలో అభిషేక్‌ బచ్చన్‌లు ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా? మీ బిడ్డ శ్వేత యుక్తవయసులో నాలాగా చిత్రసీమలో ఎదురుదెబ్బలు తిని, డ్రగ్స్ కు అలవాటు పడి లైగింకగా వేధింపులకు గురైతే ఇదే విధంగా మాట్లాడగలరా? మీ అబ్బాయి అభిషేక్‌ నిరంతర బెదిరింపులకు, వేధింపులకు గురై ఫిర్యాదు చేసి, ఒక రోజు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటే కూడా ఇలానే మాట్లాడతారా? మాపై కూడా మీరు దయ చూపండి..’’ అంటూ పేర్కొంది.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.