ఇప్పుడున్న స్టీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ లో అలాంటివే వస్తున్నాయి: కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తనకు ఏది అనిపిస్తే అది కచ్ఛితంగా అందరితో పంచుకుంటోంది. ఆ మధ్య సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి మరెన్నో రాజకీయ అంశాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. తాజాగా ఓటీటీ డిజిటల్‌ స్టీమింగ్‌లపై తనదైన రీతిలో తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ‘‘ఇప్పుడు మనం చూసే సినిమా థియేటర్‌ల అనుభవాన్ని రక్షించుకోవాలి. వ్యక్తిగత వీక్షణ కోసం ఎక్కువగా లైంగిక కంటెంట్‌ ఉండంటం వల్ల ప్రేక్షకులను సినిమా థియేటర్ల వైపు తీసుకురావడం కష్టంగా అవుతోంది. ఇప్పుడున్న స్టీమింగ్‌ ప్లాట్‌ ఫామ్స్ అన్నీ పోర్న్ హబ్స్ తప్ప మరేమీ కాదని’’ ట్విట్టర్లో పేర్కొంది. మొత్తం మీద ఇప్పుడొస్తున్న చిత్రాలపై కూడా పరోక్షంగా కామెంట్‌ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్‌‌ వేదికలపై వచ్చే చిత్రాలన్నీ అడల్ట్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని వాపోయింది. కంగనాపై ఈ మధ్య కొన్ని కేసులు కూడా పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టిన, ఎన్ని బెదిరింపులు చేసినా వెనక్కు తగ్గే మనస్తత్వం కంగనాది కాదని ఆమె అభిమా‍నులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.