అధీరాతో ‘తలైవి’

యశ్‌ కథానాయకుడుగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’. గతంలో ఇదే కలయికలో వచ్చిన ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా రాబోతుంది. ఈ చిత్రంలో అధీరా అనే పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు సంజయ్‌ దత్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ మేరకు గురువారం ప్రధాన తారాగణం భాగ్యనగరం చేరుకున్నారు. సంజయ్‌ దత్‌ ఓ ప్రముఖ హోటల్‌లో బస చేస్తున్నారు. అనుకోకుండా బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ అదే హోటల్‌లో దిగారట. సంజయ్‌ తానుంటున్న హోటల్‌లోనే ఉన్నారనే విషయం తెలుసుకున్న కంగనా వెంటనే ఆయన్ను కలుసుకుంది. గతంలో కంటే ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉన్న సంజూ భాయ్‌ని చూసి ఆశ్చర్యానికి గురైనట్టు తెలిపింది కంగనా. దివంగత నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధారంగా తెరకెక్కుతోన్న ‘తలైవి’లో నటిస్తుంది కంగనా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.