పోరాటాలు చేసేందుకు కసరత్తులు చేస్తున్న కంగనా

కంగనా రనౌత్ ఇప్పుడు దేశంలో ఓ ఫైర్‌బ్రాండ్‌. సినిమాల్లో మణికర్ణికగా కత్తిపట్టి యుద్ధం చేయగలదు. అలాగే తన చుట్టూ జరుగుతున్న విషయాలపై అదే స్థాయిలో విరుచుకుపడే నైజం రనౌత్‌ది. ప్రస్తుతం తలైవి చిత్రం సెట్స్ పై ఉండగానే కొత్త చిత్రం పోరాటాలు మొదలుపెట్టింది. తాజాగా కంగనా సినిమాల్లో పోరాటాలు చేయడానికి శిక్షణ తీసుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియోను సైతం తన ట్విట్టర్లో పెట్టింది. నా తరువాతి చిత్రాలైన తేజ్‌స్‌ ధకాడ్‌ల కోసం యాక్షన్ సీన్స్ కోసం శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. రాబోయో ఈ సినిమాల్లో ఫౌజి, స్పై పాత్రల్లో నటిస్తున్నా. హిందీ చిత్రసీమ నాకెంతో ఇచ్చి ఉండవచ్చు. కానీ మణికర్ణికలాంటి ఘనవిజయం అందించిన చిత్రాన్ని నేను బాలీవుడ్‌కి ఇచ్చా. ఇదే నా సరైన బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోయిన్‌ అంటూ ట్విట్టర్లో పేర్కొంది. ఆ మధ్య తన ట్విట్టర్‌ వేదికగా ‘‘చిత్రసీమను 8 రకాల ఉగ్రవాదుల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని’’ చెప్పింది. ‘ముఖ్యంగా నేపోటిజం టెర్రరిజం, డ్రగ్ మాఫియా టెర్రరిజం, సెక్సిజం టెర్రరిజం, మత - ప్రాంతీయ ఉగ్రవాదం, ఫారిన్ ఫిల్మ్స్ టెర్రరిజం, పైరసీ టెర్రరిజం, లేబర్‌ దోపిడీ టెర్రరిజం, టాలెంట్ దోపిడీ టెర్రరిజం" వీటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరు అనకుంటున్నట్లు ఇండియా చిత్రీసీమలో బాలీవుడ్‌దే టాప్‌ అనుకునే ప్రజల అభిప్రాయం తప్పు. భారతదేశంలో తెలుగు చిత్రసీమ అగ్రస్థానానికి చేరుకుంది. టాలీవుడ్‌ ఇప్పుడు భారతేదశంలో బహుభాషల్లో చిత్రాలను విడుదల చేస్తుంది అంటూ పేర్కొంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.