బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని బంగ్లాలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ముంబై బీంఎంసీ అధికారులు బంగ్లాను కొంత మేర కూల్చివేసిన సంగతి తెలిసిందే. కూల్చివేతపై నటి కంగనా హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కంగనా వేషిన ఫిటిషన్‌పై ముంబై కోర్టు విచారిస్తూ..కేవలం దురుద్దేశం, పగతో చేశారనిపిస్తోంది. బీఎంసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్టపరమైన ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నోటీస్ వల్ల ఫిర్యాదుదారు బాధతో పాటు అసౌకర్యానికి గురైంది. అందుకు గాను నష్టపరిహారం చెల్లించాలని బీఎంసీని ఆదేశించింది. అంతేకాదు ఆ నష్టం అంచనా వేసేందుకు ఓ సర్వేయర్ నియమించి ఆ వివరాలను వచ్చే ఏడాది మార్పి 21లో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ..‘‘ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి గెలిచినప్పుడు, అది వ్యక్తి యొక్క విజయం కాదు, అది ప్రజాస్వామ్యం యొక్క విజయం. నాకు ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా గురించి నవ్వినవారికి సైతం ధన్యవాదాలు. మీరు విలన్ పాత్ర పోషించడానికి మాత్రమే. కారణం నేను హీరోను అయ్యాను’’ అంటూ పేర్కొంది .