మరోసారి తల్లౌతున్న కరీనా కపూర్‌

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ - సైఫ్ అలీఖాన్‌లు ఓ తియ్యని శుభవార్తని చెప్పారు. అదేమంటే ‘తమ ఇంట్లోకి కొత్త సభ్యున్ని ఆహ్వానించడానికి’ సిద్ధంగా ఉన్నారట. వీరికి ఇప్పటికే తొలి సంతానంగా తైమూర్‌ అలీఖాన్‌ ఉన్నారు. గత కొన్నాళ్లుగా తైమూరు అల్లరితో సంతోషంగా ఉన్న కరీనా కపూర్‌  తైమూర్‌ ఆడుకోవడానికి సోదరో-సోదరుడిని ఇవ్వబోతుంది. కరీనా సైఫ్‌ అలీఖాన్‌ దంపతులు ఈ సంతోషకరమైన వార్తను అధికారికంగా తెలియజేస్తూ..‘‘మేం మా కుటుంబంలోకి అదనంగా కొత్త సభ్యున్ని ఆశిస్తున్నాం. ఈ వార్త మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు...’’అంటూ పేర్కొన్నారు. 2012లో ఒక్కటైన కరీనా - సైఫ్‌ జంటకు తైమూర్‌ ఖాన్‌ తొలి సంతానం. గత ఏడాది ‘గుడ్‌న్యూజ్‌’ చిత్రంతో హంగామా చేసిన కరీనా ఈ ఏడాది మంచి శుభవార్తే చెప్పిందని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రంలో నటిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.