తమిళ నటుడు కార్తీకి వారసుడొచ్చాడు


ప్రముఖ తమిళనటుడు కార్తీ మరోసారి తండ్రి అయ్యారు. అతని భార్య రంజని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ఈ ఆనంద విషయాన్ని వెల్లడించారు. ‘‘ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులారా, మాకు అబ్బాయి పుట్టారు. మా జీవితాన్ని మార్చే ఈ సమయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్న మా వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. మా చిన్నవాడికి మీ ఆశీస్సులన్నీ కావాలి. దేవుడా నీకు ధన్యవాదములు!’’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే వీరికి ఏడేళ్ల ఉమయాల్‌ అనే కూతురు ఉంది. ఈ చిన్నారి 2013లో పుట్టింది. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’‌ చిత్రంలో నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. రష్మిక ఈ చిత్రంతోనే తమిళంలో అడుగుపెట్టింది. త్వరలోనే చిత్రం విడుదల కానుంది. గత ఏడాది లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రం ఘన విజయం సాధించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.