కీర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ ఎంతమందో తెలుసా!

కీర్తి సురేష్‌ పేరుకు తగ్గట్లే అచ్చంగా కీర్తి తెచ్చిపెట్టే ‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవతరించింది. చూడచక్కని కీర్తి ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అలరిస్తూ సందడి చేస్తుంది. తాజాగా కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైలురాయిని చేరకుంది. ఇప్పుడు కీర్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించే వారి సంఖ్య అక్షరాల యాభైలక్షలను దాటేసింది. ఈ సందర్భరంగా కీర్తి అభిమానుల ఓ వీడియోను తయారు చేసి షేర్‌ చేసింది. వీడియోలో కీర్తి ఎటువంటి మేకప్‌ లేకుండా సహజమైన అందంతో తన పెంపుడు కుక్కతో సందడి చేసింది. అంతేకాదు..‘‘ఇప్పుడు నా కుటుంబం 5 మిలియన్లకు చేరింది. నేను మీ ప్రేమకు నేను కృతజ్ఞలను చెప్పకుండా ఉండలేను’’ అంటూ ట్విట్‌ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ రజనీకాంత్‌తో కలిసి ‘అణ్ణాత్తే’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ లక్‌ సఖి’ చేస్తుంది. హీరో నితిన్‌తో కలిసి ‘రంగ్‌దే’ చిత్రంలోను కథానాయికగా చేస్తుంది.




View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.