‘ఖల్‌నాయక్’‌ సంజయ్‌దత్‌కి క్యాన్సర్‌

బాలీవుడ్‌ ‘ఖల్‌నాయక్’‌ సంజయ్‌దత్‌కి క్యాన్సర్‌ వ్యాధి సోకింది. ఆయనకు క్యాన్సర్‌ సోకినట్లు ముంబైకి చెందిన లీలావతి ఆసుపత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. సంజయ్‌దత్‌ శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో గత శనివారం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగవ్వడంతో నిన్న డిశ్చార్జ్ అయ్యారు. తొలుత ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ముందుగా కోవిడ్‌-19 పరీక్ష చేయగా వైరస్‌ లేనట్లు తేలింది. తరువాత ఛాతీ పరీక్షలు చేయగా అందులో ద్రవాలు ఉన్నట్లు గుర్తించారు. మరో పరీక్ష చేయగా ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు వెల్లడయింది. ఇప్పుడాయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌ స్టేజ్‌-4లో ఉన్నారు. డిశ్చార్జ్ అయిన హీరో సంజయ్‌దత్ మాట్లాడుతూ..‘‘ప్రస్తుతం వైద్య చికిత్స కోసం కొంతకాలం పాటు నేను చేసే వృత్తికి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతుగా నిలిచారు. మీ ప్రేమాభిమానాలతో త్వరలోనే కోలుకుంటాను. కానీ పుకార్లను నమ్మవద్దు..’’అంటూ చెప్పారు. ప్రస్తుతం సంజయ్‌దత్‌ మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నటించిన ‘సడక్‌ 2’ సినిమా ఆగస్టు 28న డిస్నీ + హాట్‌స్టార్‌ వీఐపీలో విడుదల కానుంది. సంజయ్‌దత్‌ తల్లి నర్గీస్‌ 1980 నుంచి 1981 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగింది. అలాంటి ఆమె ఆగస్టు 2, 1980 రాజ్యసభ సమావేశాలు జరుగుతన్నప్పుడు అనారోగ్యానికి గురైంది. పదిహేను రోజుల తరువాత ఆమె పరిస్థితి మరింతగా దిగజారింది. తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోయింది. తరువాత ఆమెకు ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ అని తేలింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.