వాళ్లను చాలా మిస్‌ అవుతున్నాను: కియారా


‘భరత్‌ అనే నేను’ చిత్రంలో మహేష్‌బాబు ప్రియురాలుగా నటించి అలరించిన నటి (వసుమతి) కియారా అడ్వాణి. ఈ అందాల తెలుగులో పాటు హిందీలోనూ కథానాయికగా రాణిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ పాటిస్తూ ఇంట్లోనే‌ ఉంటూ తనకిష్టమైన పనులు చేస్తూ, వాటిని సరదాగా తన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెడుతూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ‘వినయ విధేయ రామ’ భామ కియారా తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతేకాదు వాటికి తనదైన రీతిలో స్నేహితుల గురించి ఎంతో ఆత్మీయంగా కొన్ని వ్యాఖ్యలు కూడా జోడిస్తూ...‘‘నేను నా స్నేహితులను చాలా మిస్‌ అవుతున్నాను. నేను ఇప్పుడు వారిని కలవాలనుకుంటున్నా. కానీ ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే ఇప్పుడంతా రిస్క్ చేయడం మంచిది కాదు. మా స్నేహితులకు ఈ రోజు ప్రత్యేకంగా మెచ్చుకునే అంశం అవుతుంది.

మేమంతా ఒకటే. అన్నీ విషయాలను పంచుకొంటుంటాము. దాపరికం చేసే విషయాలు ఏవీ మా మధ్య లేవు. పాఠశాల నుంచి కాలేజీ చదువులు పూర్తయ్యే వరకు. ఆ తరువాత నాలుగు పెళ్లిళ్లు, మూడు రకాల ప్రాంతాలు అయినా సరే మేమంతా ఆత్మీయ స్నేహితులం. ఇప్పటికీ కలుసుకొంటూనే ఉన్నాం.. ‘‘అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకుంది. ఈ మధ్య చనిపోయిన బాలీవుడ్ నటుడు సుశాంత్‌ గురించి కూడా చాలా బాధపడింది. కియారా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘లక్ష్మీబాంబ్’‌ చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రంలోనూ సందడి చేయనుంది. గత ఏడాది కియారా కరీనా కపూర్‌, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి ‘గుడ్‌న్యూజ్’‌ చిత్రంలో నవ్వుల హంగామా చేసింది. ఇక తెలుగులో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ చిత్రంగా బాలీవుడ్‌లో వచ్చిన ‘కబీర్‌సింగ్‌’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌తో కలిసి వెండితెరపై ప్రేమకథను పండించింది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.