‘కేజీఎఫ్‌’ భలే రికార్డు కొట్టిందిగా..

‘బాహుబలి’ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో దేశ సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన దక్షిణాది చిత్రం ‘కేజీఎఫ్‌’. ఇది కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమల స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది. ఈ చిత్రంతో కథానాయకుడు యష్‌ క్రేజ్‌ జాతీయ స్థాయికి పాకింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సరికొత్త పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌ తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన చిత్రాల్లో అన్ని భాషల్లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ‘కేజీఎఫ్‌’ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా అధీరా అనే శక్తిమంతమైన డాన్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.