అల్లు అర్జున్‌తో కొరటాల చిత్రం ఖరారు

కొరటాల శివ - అల్లు అర్జున్‌ల చిత్రం కోసం ఎప్పుడాఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఆ శుభవార్త రానే వచ్చింది. అల్లు అర్జున్‌ తన 21వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించనున్నారు. సినిమాపై అల్లు అర్జున్‌ ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘ఈ సినిమా ప్రటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. కొరటాల శివతో చిత్రం చేయడం చాలా ఉద్విగ్నభరితం కలిగిస్తోంది. గత కొంతకాలంగా చిత్రం ఎప్పుడు ఖరారు అవుతుందనే విషయం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూశాను. ఇక నిర్మాతగా తొలి సినిమా రూపొందిస్తున్న సుధాకర్‌ మిక్కిలినేనికి శుభాకాంక్షలు. శాండీ, స్వాగతి, నట్టి..మీ అందరిపై నా ప్రేమను చూపించే విధానం ఇలానే ఉంటుంది..’’ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమా 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా నటీనటులు, సాంకేతిక వర్గం ఎవరినేది త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించనుందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే కొరటాల శివ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు కొరటాల చిరంజీవితో కలిసి ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.