రవితేజతో చిందేస్తుంది

యువ నాయిక అంకిత రాణా అలియాస్‌ అప్సర రాణి.. మాస్‌ మహారాజా రవితేజతో ఆడిపాడుతుంది. రవితేజ హీరోగా ‘క్రాక్‌’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలినేని గోపీచంద్‌ దర్శకుడు. ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో నర్తించేందుకు అప్సరని ఎంపిక చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. సామాజికమ మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు గోపీ. షూటింగ్‌ లొకేషన్‌లోని ఓ ఫొటోని విడుదల చేశారు. ఇందులో రవితేజ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. పోలీసు అధికారి పాత్రలో వీరశంకర్‌గా నటిస్తున్నారు రవితేజ. శ్రుతి హాసన్‌ నాయిక. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.