గోవాలో.. తుది దశలో

రవితేజ కథానాయకుడుగా మలినేని గోపీచంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతుంది. ఇందులో పోలీసు అధికారి వీర శంకర్‌ పాత్రలో కనిపించనున్నారు రవితేజ. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉందీ చిత్రం. ఆఖరి షెడ్యూల్‌ని గోవాలో తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 2021 సంక్రాంతికి బాక్సాఫీసు బరిలో నిలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్ర ఖని కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ-గోపీచంద్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.