కృష్ణంరాజు బర్త్‌డే వేడుకల్లో ప్రభాస్‌ సందడి చూశారా..

థానాయకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు. నేడు ఆయన 80వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్‌లోని కృషంరాజు స్వగృహంలో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ పాల్గొని తన పెద్దనాన్నతో కేక్‌ కట్‌ చేయించడంతో పాటు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వేడుకల్లో ప్రభాస్‌ సందడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి, మంచు మోహన్‌బాబు కుటుంబం, సతీష్‌ వేగేశ్నతో పాటు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా బయటకొస్తున్న ఫొటోల్లో ప్రభాస్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ మధ్య ‘సాహో’ కోసం కాస్త రఫ్‌ లుక్‌లో దర్శనమిచ్చిన డార్లింగ్‌.. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘జాన్‌’ కోసం పూర్తిగా లవర్‌ బాయ్‌ లుక్‌లోకి మారినట్లు అర్థమవుతోంది. ఇది తన పెద్దనాన్న సొంత సంస్థ గోపీకృష్ణ మూవీస్‌లో నిర్మితమవుతోన్న చిత్రం. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.