మెగా ఫోన్‌ పట్టనున్న బుర్రా!

‘కంచె ’ , ‘కృష్ణం వందే జగద్గురమ్‌’, ‘ గౌతమిపుత్ర శాతకర్ణి’ , ‘ ఖైదీనంబర్‌ 150 ’, ‘ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ’..వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలను అందించారు రచయిత సాయి మాధవ్‌ బుర్రా. ఆయన త్వరలో దర్శకుడిగా కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రచయితలు, దర్శకులుగా మారడం చిత్రపరిశ్రలో పరిపాటే. ప్రభాస్‌ కథానాయకుడిగా బుర్రా మొదటి సినిమా ఉండబోతోందట. ఈ మధ్యే ప్రభాస్‌ను కలిసి కథను వినిపించారట. కథ ప్రభాస్‌కు ఎంతో నచ్చిందట. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలో ప్రకటించాల్సి ఉంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.