లైవ్‌ టెలీకాస్ట్ లో భయపెడుతున్న కాజల్‌

కాజల్ అగర్వాల్‌ ఈ మధ్యకాలంలో ఆమె గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏమిటంటే కాజల్‌ ఈనెల 30 వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను పెళ్లిచేసుకోనుంది. అంతేకాదు కాజల్‌ తొలిసారిగా వెబ్‌సీరీస్‌లోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఆమె నటించిన లైవ్‌ టెలికాస్ట్ చిత్రం త్వరలోనే డీస్నీ+హాట్‌ స్టార్లో విడుదల కానుంది. వెంకట్‌ ప్రభు దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ సీరీస్‌ని కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో కాజల్‌ చూపులు భయపెట్టేలా ఉన్నాయి. చిత్రంలో కాజల్‌ షో డైరక్టర్‌గా నటిస్తుండగా, వైభవ్‌, కాయన్‌ ఆనందీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. మొత్తం మీద పెళ్లి చేసుకునే ముందే ప్రేక్షకులను భయపెట్టే పాత్రలో హల్‌చల్‌ చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక దర్శకుడు వెంకట్‌ ప్రభు చిత్రం గురించి మాట్లాడుతూ..నా వెబ్‌ షో బి,సి సెంటర్లోని ప్రేక్షక్షులకు చేరుకోవాలని కోరుకుంటున్నా. కచ్చితంగా చిత్రం వారికి నచ్చుతుందని నమ్ముతున్నాని చెప్పారు.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.