‘మజిలీ’, ‘వెంకీమామ’ వంటి హిట్ల తర్వాత నాగచైతన్య కథానాయకుడిగా ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఫిదా’ వంటి హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకోని ఈ చిత్రం నుంచి ‘‘ఏయ్ పిల్లా..’’ మ్యూజికల్ ప్రివ్యూను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిమిషం నిడివి ఉన్న ఈ పాట టీజర్లో సాయి పల్లవి.. చైతూకి ముద్దిచ్చిన సన్నివేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సీన్లో రౌడీ పిల్ల చైతూకి సర్ప్రైజింగ్గా ముద్దివ్వగా.. ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం మనసుల్ని హత్తుకుంది. తాజాగా ఈ సీన్‌పై చైతన్య సతీమణి సమంత ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ ఇప్పుడే చూశా. చాలా బ్రిలియంట్‌గా ఉంది. ఆ చివరి షాట్ చూశాక కొన్ని సెకన్ల పాటు నా బుర్ర ఆగిపోయినట్లయింది’’ అంటూ సరదాగా స్పందించింది సామ్.