‘మహానటి’ నట ప్రస్థానం మొదలైన రోజు
థానాయికగా మొదటిసారి మేకప్‌ వేసుకున్న రోజు ఎప్పటికీ ప్రత్యేకమే. మహానటి కీర్తి సురేష్‌ నట ప్రస్థానం మొదలై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక భావోద్వేగపు పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆరేళ్ల క్రితం ఇదేరోజు నేను నటిగా జన్మించాను. ఎన్నో విభిన్న పాత్రల్లో జీవిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నటిగా నన్ను అంగీకరించినందుకు, నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు, ఒక నటిగా ఈ ప్రయాణంలో ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన నా కుటుంబసభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. పాప్‌కార్న్‌ తింటూ మీమీ సీట్లలో కూర్చోండి...మనం మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని కీర్తి పేర్కొన్నారు.


2013లో విడుదలైన ‘గీతాంజలి’ అనే మలయాళ చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు కీర్తి. టాలీవుడ్‌లో విడుదలైన ‘నేను శైలజ’ చిత్రం ఆమెకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కీర్తి మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. గతేడాది విడుదలైన ‘మహానటి’ చిత్రంలో కీర్తి నటన ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఈ చిత్రానికి కీర్తి సురేష్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘మైదాన్‌’ చిత్రంతోపాటు పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.