‘మహర్షి’ ప్రీ రిలీజ్‌ మే1న ?

మహేష్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందింది. మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే1న ‘మహర్షి’ ముందస్తు విడుదల వేడుక హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేసున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా కృష్ణ హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగానే ట్రైలర్‌ విడుదల చేస్తారట. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన గీతాలను ప్రచారంలో భాగంగా ఒక్కొక్కటిగా ఇప్పటికే చిత్రబృందం విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.