‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌లో గంగవ్వ

‘మహర్షి’ వంటి హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మహేష్‌కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. లేడీ అమితాబ్‌ విజయ్‌శాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే పనిలో పడింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తూ సినీప్రియులను సర్‌ప్రైజ్‌ చేస్తోంది చిత్ర బృందం. ఇక ఇప్పుడు నెట్టింట ప్రచార పర్వాన్ని హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు అనిల్‌... మహేష్‌ కోసం గంగవ్వను రంగంలోకి దించారు. ‘మై విలేజ్‌ షో’ ఛానెల్‌తో యూట్యూబ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది గంగవ్వ. ఇప్పుడీమె ద్వారా సదరు యూట్యూబ్‌ ఛానెల్ బృందంతో చిత్ర యూనిట్‌ ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని తీర్చిదిద్దారట. తాజాగా దానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో దర్శకుడు అనిల్‌ని ప్రశ్నలతో ఆటాడుకుంటుంది గంగవ్వ. మరి ఆ అల్లరి ఎలా ఉందో మీరూ చేసేంయండి...
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.