మావాడు నాతో పోటీపడుతున్నాడు!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ మధ్య కూతురు సితార, కొడుకు గౌతమ్‌ కలిసి చేసిన కొన్ని ఫన్నీ వీడియోలు అభిమానులను అలరించాయి. తాజాగా మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌తో కలిసి తనంత హైట్‌ ఉన్నాడా లేడా అంటూ చెక్‌ చేసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని మహేష్‌ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో...‘‘హైట్‌ చెక్‌, హీ ఈజ్‌ టాల్‌..అంటూ’’ సరదగా వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియోను చూసిన మహేష్‌బాబు అభిమానులతో పాటు చాలామంది తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్లు పెడతున్నారు. మహేష్‌బాబు మామూలు సమయాల్లోనే షూటింగ్‌ అయిపోగానే ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతుంటారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా తన పూర్తి సమయాన్ని పిల్లలతోనే గడిపేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుక్కి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మహేష్‌బాబుకి ఘనమైన విజయాన్ని అందించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో కథానాయికగా రష్మిక మండన్న నటించింది. మరో సీనీయర్‌ నటి విజయశాంతి ఇందులో ఫ్రొఫెసర్‌గా నటించి అలరించింది.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.