కీర్తిని ఆహ్వానించిన మహేష్‌

మహేష్‌ బాబు కథానాయకుడుగా ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. పరశురామ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో నాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. నేడు కీర్తి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించేందుకు ఆహ్వానించాడు మహేష్‌. కీర్తికి గుర్తుండిపోయే చిత్రాల్లో ‘సర్కారు వారి పాట’ ఒకటవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ధన్యవాదాలు మహేష్‌ బాబు గారు. మీతో తొలిసారి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నాన’ని బదులిచ్చింది కీర్తి. బ్యాంకు నేపథ్యంలో సాగే కథ ఇది అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అంచనాలు పెంచుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ప్లస్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.