ఆ జాబితాలో ఈ రెండు చిత్రాలు!

ప్పుడు హవా అంతా సోషల్‌ మీడియాదే. మనకు ఏది కావాలన్నా అదే ఆధారం. దాచుకోలేనంతా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అలాంటప్పుడు ఏ అంశం గురించి అయినా అన్వేషించాలంటే హ్యాష్‌ట్యాగ్‌ సహాయం చేస్తుంది. హ్యాష్‌ట్యాగ్‌ డే సందర్భంగా ట్విటర్‌ టాప్‌ 5 హ్యాష్‌ట్యాగ్స్‌ జాబితా విడుదల చేసింది. 2019 జూన్‌ వరకు బాగా పాపులరైన అంశాలను పరిగణలోనికి తీసుకుని వాటిని ప్రకటించింది. ఇందులో తమిళ ఓ సినిమా, ఓ తెలుగు సినిమా ఉండటం విశేషం. అవేంటో చూద్దామా.. లోక్‌ సభ ఎన్నికలు, వరల్డ్‌ కప్‌ సైతం వెనక్కు నెట్టి మొదటి స్థానం దక్కించుకున్న సినిమా ‘విశ్వాసం’. అజిత్‌ నటించిన ఈ చిత్రం టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచే ట్విటర్‌లో ఈ పేరు వైరల్‌ అయింది. మహేష్‌ నటించిన ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఈ ఇద్దరు కథానాయకుల అభిమానులు పండగ చేసుకుంటున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.