టీజర్‌ ట్రీట్‌ రెడీ..

మేజర్‌ అజయ్‌కృష్ణ సినీప్రియులకు టీజర్‌తో ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌కు జోడీగా రష్మిక సందడి చేయబోతుండగా.. విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, బండ్లగణేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. దీనికి మరికొద్ది రోజుల సమయమే మిగిలి ఉండటంతో ప్రచార పర్వాన్ని షురూ చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా చిత్ర టీజర్‌ను బయటకొదిలేందుకు సిద్ధమవుతోంది సరిలేరు యూనిట్‌. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘టీజర్‌ లోడింగ్‌’’ అంటూ చిన్న ప్రచార చిత్రాన్నీ షేర్‌ చేశారు. ఈ క్లిప్పింగ్‌లో మహేష్‌ మేజర్‌ లుక్‌లో తుపాకీ లోడ్‌ చేస్తూ ప్రతినాయకులను మట్టుబెట్టేందుకు వెళ్తున్నట్లుగా దర్శనమిచ్చారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.