గర్వించే సినిమాను ఇచ్చావు థ్యాంక్స్‌: మహేష్‌ ట్వీట్‌

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మహర్షి’. విజయవాడలో విజయోత్సవాన్ని జరుపుకొంది. ఈ సినిమాను ఉద్దేశిస్తూ కథానాయకుడు మహేష్‌ బాబు ఓ ట్వీట్‌ ఇచ్చారు. ‘‘ వంశీ....నేను గర్వపడేలా నా 25వ సినిమాను తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. మీరు తప్ప ఈ సినిమా ఇంకెవ్వరూ చెయ్యలేరన్న నువ్వన్న మాటలు..ఆ రోజులు గుర్తున్నాయి. నేను ఈ మాటల్ని పెద్ద కాంప్లిమెంట్‌గా ఎప్పటికీ గుర్తుంచుకొంటాను’’ అని రాశారు. దీనికి సమాధానంగా వంశీ స్పందిస్తూ...‘‘మీ ప్రోత్సాహం, ప్రేమ, ‘మహరి’్ష కోసం టీం సభ్యులు పడిన కష్టం ఈ సినిమా విజయవంతం కావడానికి తోడ్పడ్డాయి. ధన్యవాదాలతో సరిపుచ్చలేను’’ అని రాశారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.