మీరెంతో గొప్పోళ్లు: మహేష్‌బాబు


ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో తెలుగునాట సందడి చేసిన కథానాయకుడు మహేష్‌బాబు. తాజాగా ఆయన ట్విట్టర్లో 10 మిలియన్ల అనుసరణ గణాన్నిసంపాదించాడు. సామాజిక మాధ్యమైన ట్విట్టర్లో దక్షిణాదిలో ఏ కథానాయకుడికి లేనంత ఫాలోవర్స్ ని ఆయన సంపాదించారు. ముఖ్యంగా మహేష్‌ తన పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటుంటారు. అందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్‌ ప్రతిక్షణం కుటంబమే సరస్వంగా భావిస్తూ.. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలో స్వయంగా పాటించి మరీ చెప్తుంటాడు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ కి ధన్యవాదాలు తెలపుతూ..‘‘నా మనసులోని కృతజ్ఞతాభావాన్ని మీకు తెలపడానికి కోటి ధన్యవాదాలు కూడా సరితూగవు. మీ అందరితో ఇలాంటి వేదిక ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమతో మీ అందరికి ధన్యవాదాలు..’’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.