మహేష్‌ జిమ్‌ పేరేంటో తెలుసా?

మహేష్‌ బాబు వ్యక్తిగత, సినిమాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌. తాజాగా మహేష్‌ వ్యాయామశాలని పరిచయం చేసింది. మహేష్‌ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. ప్రతిరోజు కసరత్తులు చేసి వయసు తగ్గించుకుంటారాయన. ఇందుకు ఇంట్లోనే పెద్ద జిమ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ ఈ జిమ్‌ పేరుని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో మహేష్‌ షార్ట్‌లో దర్శనమిచ్చాడు. ఈ వీడియోకి ‘ది లైన్స్‌ డెన్‌’ అనే వ్యాఖ్యను జోడించింది నమ్రత. సింహాలుండే ప్రదేశమని దానర్థం. సినిమాల విషయానికొస్తే పరశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు మహేష్‌. త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.