ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి: మహేష్‌బాబు

‘‘ప్రస్తుతం మనం సాధారణ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాము. దశలవారిగా లాక్‌డౌన్‌ పరిమిత సడలింపులతో అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ముందుకు సాగాలి అంటున్నాడు..’’ సినీ నటుడు మహేష్‌బాబు. తాజాగా ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘సామాజిక దూరం పరిశుభ్రతను పాటించాలి. మీరు ఇంటి బయటకు వచ్చిన ప్రతిసారి కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించండి. మనల్ని మనం రక్షించుకోవడానికి భౌతిక దూరం పాటించండి. ఇది మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో మనం ఎలా ఉండాలనేది మనచేతుల్లోనే ఉంది. భయాందోళన కలిగించే వార్తలకు దూరంగా ఉంటే మంచింది. నకిలి వార్తలు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. త్వరలోనే మనం సాధారణ జీవితంలోకి వచ్చేస్తాం. నేను మాస్క్ ధరించాను. మరీ మీరు? అంటూ..’’ పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ మహేష్‌బాబు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలను నమత్రా మహేష్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టి నవ్విస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.