జాగ్రత్తగా మసలుకోండి: మహేష్‌బాబు


ఇప్పుడు అక్కడాఇక్కడా అని లేదు. ప్రపంచంలో ఏమూల కెళ్లినా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) అనుకోని అతిధిలా చుట్టేస్తుంది. తెలుగు నటుడు మహేష్‌బాబు ఇప్పటికే కరోనా గురించి చాలాసార్లు తన ట్విట్టర్‌ వేదికగా చేసుకొని కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటూ పలుసార్లు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘ప్రస్తుతం లాక్‌డౌన్‌ తరువాత ఈ మహమ్మారి శరవేగంగా పెరుగుతూ కనిస్తోంది. ఇప్పుడు మనం మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవాల్సిన సయయం. మీరు బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించండి. మీరు సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించండి. ప్రతిఒక్కరు విధిగా ప్రభుత్వం జారిచేసిన ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుంది. అత్యవసర సేవలను కల్పించడంలో ఇది మీకు సహాయపడుతుంది. సురక్షితంగా ఉండండి. ఈ మహమ్మారి గురించి పూర్తిగా తెలుసుకొని మరింత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’’అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకు రుణాల కుంభకోణం నేపథ్యంగా అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.