మహేష్‌బాబు కొత్త చిత్రం ప్రకటన వచ్చేసింది


హీరో మహష్‌బాబుతో కొత్త సినిమా చేస్తున్నట్లు  మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్లో తెలిపింది. ప్రముఖ దర్శకుడు పరశురామ్‌తో దర్శకత్వంలో మహేష్‌బాబు తన 27 చిత్రాన్ని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 31, ఉదయం 9.9 నిమిషాలకు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మహేష్‌ ఈ ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మెప్పించారు. ఇక దర్శకుడు పరశురామ్‌ 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ చిత్రం తరువాత చేస్తున్న చిత్రం ఇదే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.