రాజమౌళికి ట్విట్టర్లో ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా!


తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా పరిశ్రమకే వన్నెతెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి. ‘బాహుబలి’ చిత్రంతో ఆయన పేరు ప్రపంచమంతా పాకింది. అలాంటి రాజమౌళి ట్విట్టర్లో 5మిలియన్ల అనుసరణగణం సంపాదించాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుథిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌కి చెందిన నటీనటులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌కి చెందిన అలియా భట్‌ రామ్‌చరణ్‌కి జోడిగా నటించగా, ఎన్టీఆర్‌ సరసన ఒలివా మోరిస్‌ నటించనుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే సినిమాని పట్టాలెక్కించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తరువాత మహేష్‌బాబుతో కలిసి ఓసినిమా తెరకెక్కించనున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి కె.ఎల్‌.నారాయణ నిర్మాత.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.