నాన్నతో కలిసి సితార స్విమ్మింగ్‌ పోటీ!

మన తెలుగు సినిమా రంగంలో మహేష్‌బాబు షూటింగ్‌ ఉంటే సెట్లో ఉంటారు. లేకపోతే ఇంట్లోనే ఉంటారని టాలీవుడ్‌లో చెప్పుకుంటుంటారు. అయితే తాజాగా మహేష్‌ తనయ సితార ఘట్టమనేని తన తండ్రితో కలిసి ఇండోర్‌ స్విమ్మింగ్‌ఫూల్లో ఈత కొడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరలవుతోంది. వీడియోని సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోకు తనదైన రీతిలో వ్యాఖ్యలను జోడిస్తూ..‘‘నాన్నతో రేసింగ్‌ చాలా సరదగా ఉంది. అయితే ఆయన చేతులు నా కంటే పెద్దవిగా ఉన్నాయి. ఇది నాన్నతో నేను పాల్గొన్న మొదటి స్విమ్మింగ్‌ రేస్‌ అంటూ..’’ పేర్కొంది. అందుకే మన భారతీయ కుటుంబాల్లో అంటుంటారు. అబ్బాయి కన్నా అమ్మాయిలకి నాన్న దగ్గర చనువు ఉంటోందని. అది ఇప్పుడు నిజమనిపిస్తోంది ఈ తండ్రీ కూతుళ్లని చూస్తుంటే. మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో నివేదా థామస్‌ ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.


View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.