మహేష్‌కు శుభాకాంక్షల వెల్లువ..
ఈరోజు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమాన హీరోకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. మరో వైపు ఈ పుట్టిన రోజు కానుకగా తన 25వ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు మహేష్‌. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మహేష్‌కు ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలియజేశారు. ‘‘సూపర్‌ స్టార్‌, నా ప్రియమైన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేయగా.. దానికి ప్రిన్స్‌ ‘‘ధన్యవాదాలు’’ అంటూ బదులిచ్చారు.అల్లరి నరేశ్‌: ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’లో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి’’.
ఎన్టీఆర్‌: ‘‘హ్యాపీ బర్త్‌డే మహేష్‌ అన్నా.. మీకు ఈ ఏడాది గొప్పగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’’.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌: ‘‘హ్యాపీ బర్త్‌డే ఎవర్‌గ్రీన్‌.. వన్‌ అండ్‌ ఓన్లీ మహేష్‌బాబు, బ్లాక్‌బస్టర్‌ సినిమాతో మీకు ఈ ఏడాది ప్రారంభం కావాలని ఆశిస్తున్నా’’.
నాగబాబు: ‘‘జన్మదిన శుభాకాంక్షలు మహేష్‌. ‘మహర్షి’ సినిమాకు ఆల్‌ది బెస్ట్‌’’.
మోహన్‌లాల్‌: ‘‘హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌ మహేష్‌’’.
అనిల్‌ రావిపూడి: ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేష్‌ గారు. ఫస్ట్‌లుక్‌ అదిరింది అన్నా..’’Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.