మహేష్‌ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌!

హేష్‌బాబు అభిమానులకు షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ అందించారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. తాజాగా ఆయన దర్శకత్వంలో మహేష్‌ కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కశ్మిర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా.. తాజాగా ఈ తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు అనిల్‌. అంతేకాదు.. దీంతో పాటు ఆర్మీ అధికారిగా మహేష్‌ లుక్‌కు సంబంధించి ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో మహేష్‌ ముఖం పూర్తిగా కనిపించనప్పటికీ.. పైన మిలటరీ క్యాప్‌.. కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌తో విన్నింగ్‌ సింబల్‌ చూపిస్తూ స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. ఇక ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ ఈనెల 26 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు అనిల్‌. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా కొన్ని సెట్లు కూడా రూపొందించిందట చిత్ర బృందం. ఈ షెడ్యూల్‌లోనే విజయశాంతి కూడా సెట్లో అడుగుపెట్టనుందట. అంతేకాదు.. రష్మిక - మహేష్‌ల లవ్‌ ట్రాక్‌కు సంబంధించిన ట్రైన్‌ ఎపిసోడ్‌ను ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఓ స్పెషల్‌ కామెడీ ట్రాక్‌ను కూడా సిద్ధం చేసుకున్నారట అనిల్‌. ఇది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.