సుభాష్‌ ఘయ్‌ నన్ను బెదిరించారు: మహిమ చౌదరి

బాలీవుడ్ నటి మహిమ చౌదరి పరదేశి చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది. ఈ ఆగస్టుకి నాటికి పరదేశి చిత్రం 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా మహిమ చౌదరి బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రముఖ దర్శకనిర్మాత సుభాష్‌ ఘయ్‌ బెదిరించారు. అంతేకాదు నేను నటించిన సినిమా యెక్క ఫస్ట్ షోని సైతం రద్దు చేయించేందుకు కోర్టుకు కూడా వెళ్లారు. అంతేకాదు నాతో ఏ ఇతర నిర్మాతలు కూడా పనిచేయవద్దని వారికి తన సందేశాన్ని కూడా పంపారు. 1998 లేదా 199లో ఓ మ్యాగజైన్‌లో ప్రకటన కూడా ఇచ్చారు.అందులో ఏముందంటే మహిమ చౌదరితో ఎవరైనా సినిమా తీయ్యాలనుకుంటే ముందుగా నన్ను సంప్రదించ వలసి ఉంటుందని దాని అర్థం. అలా చేయకపోతే ఒప్పందం ఉల్లంఘన అవుతుందంటూ ప్రచారం చేశాడు. అయినా నేను అతన్ని పట్టించుకోలేదు. అది ఒప్పందమే కాదు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నాతో సత్య సినిమా కోసం పనిచేయడానికి సంప్రదించారు. కానీ సత్య సినిమా రెండు రోజుల ముందు షూటింగ్‌ మొదలుపెడతారనగా నన్ను ఆ చిత్రం నుంచి తప్పించారు. కానీ సమాచారాన్ని నాకు లేదా నా మేనేజర్‌కి కూడా తెలియజేయలేదు. అలాంటి ధైర్యం కూడా వర్మ చేయలేకపోయాడు. తరువాత నేను సినిమా న్యూస్‌ నుంచి తెలుసుకున్నా. నేను లేకుండానే సత్య షూటింగ్‌ ప్రారంభించాడని. ఆ తరువాత వర్మతో మాట్లాడాను. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇక పరదేశి చిత్ర సమయంలో ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, డేవిడ్‌ ధావన్‌, రాజ్‌ కుమార్‌ సంతోషిలు నాకు అండగా నిలిచారు. వీరు తప్ప మరొకరు చిత్రసీమ నుంచి నాకు సాయం అందించిన వాళ్లు ఎవరూ లేరని చెప్పింది. మహిమ తెలుగులో శ్రీకాంత్‌, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం ‘మనసులో మాట’ చిత్రంలో నటించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియగా మహిమ చౌదరి నటించి అలరించింది. ఇంగ్లీష్‌ నవల ‘ది వర్డ్ ఇన్‌ మై హార్ట్’ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన ‘కన్నెదిరీ థాండ్రినల్‌’కి ఈ చిత్రం రీమేక్.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.